చంద్రబాబు బర్త్ డే సెలబ్రేషన్స్ అదిరిపోవాలి : కార్యకర్తలతో కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – ఈనెల 20వ తేదీనా మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆపార్టీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రకటించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో మంగళవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. 20వ తేదీనా చంద్రబాబు జన్మదిన వేడుకలతో పాటూ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో నేతలంతా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఎమ్మెల్యే కార్యాలయంలో ఆ రోజు మెగా రక్తదాన శిభిరాన్ని నిర్వహిస్తున్నట్లు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలియజేశారు.

 

Read Previous

ఈనెల 19న ప్రపంచ కాలేయ దినోత్సవం : అవగాహన కల్పించిన మెడికవర్ వైద్యులు

Read Next

ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి… జాగ్రత్తలు తీసుకోండి … అధికారులకు మేయర్ ఆదేశం

Leave a Reply

Your email address will not be published.