నెల్లూరు నర్తకి సెంటర్ లో వ్యక్తి అనుమానస్పద మృతి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నర్తకి సెంటర్ లో రోడ్డు పక్కన మంగళవారం ఉదయం ఓ వ్యక్తి మృతి చెంది ఉండగా స్థానికులు గుర్తించి సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న సంతపేట పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. తలకి బలమైన గాయం తగిలి తీవ్ర రక్త స్రావం అయి ఉండటాన్ని గుర్తించారు. జేబులను తనిఖీ చేయగా ఆధార్ కార్డు ఆధారంగా మృతిని వివరాలు తెలుసుకున్నారు. బోగోలు మండలం, బిట్రగుంట చెందిన బదనాపూరి వినయ్ కుమార్ గా గుర్తించారు. వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఎవరైనా హత్య చేశారా లేకా మద్యం మత్తులో కింద పడి చనిపోయాడా అనేది పోస్టుమార్టం రిపోర్టులో తెలియాల్సి ఉంది. సంతపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Previous

పంట కాలువలో పడి లారీ క్లీనర్ మృతి : కేసు నమోదు చేసిన పోలీసులు

Read Next

ఈనెల 19న ప్రపంచ కాలేయ దినోత్సవం : అవగాహన కల్పించిన మెడికవర్ వైద్యులు

Leave a Reply

Your email address will not be published.