పార్కిన్సన్ రోగులకు అండగా ఉంటాం : అపోలో ఆధ్వర్యంలో వాకథాన్

Clock Of Nellore ( Nellore ) – పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న వారికి మెరుగైన సంరక్షణ, అవగాహన మరియు అత్యాధునిక చికిత్సను అందించే దిశగా ముందుకు సాగుతున్నామని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరాలజీ విభాగ అధిపతి డాక్టర్ బింధు మీనన్ స్పష్టం చేశారు. శనివారం ప్రపంచ పార్కిన్సన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె నగరంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అపోలో హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, ప్రజలతో కలిసి ఆమె వాకథాన్ కార్యక్రమాన్ని చేపట్టారు. చిల్డ్రన్స్ పార్క్ నుండి అపోలో హాస్పిటల్ వరకూ సాగిన ఈ వాకథాన్ ను డాక్టర్ బింధు మీనన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాకథాన్ ద్వారా పార్కిన్సన్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే పార్కిన్సన్ తొలి దశ లక్షణాలు, జీవన శైలి మార్పులు మరియు సకాలంలో చికిత్స తీసుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు హాస్పిటల్ లో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. నిపుణులతో జరిగిన ఈ సదస్సులో రోగులలోని అపోహలను తొలగించి, వారిలో ధైర్యాన్ని నింపాయి. ప్రపంచ పార్కిన్సన్ దినోత్సవ లోగోను డాక్టర్ బింధుమీనన్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా న్యూరాలజిస్ట్ డాక్టర్ బింధు మీనన్ మాట్లాడుతూ పార్కిన్సన్ అనేది మెదడులోని నరాల బలహీనతకు సంబంధించిన ఒక తీవ్రమైన వ్యాధి అని చెప్పారు. శరీరంలో వణుకు, కదలికలు మందగించడం, కండరాల బిగుతు మరియు నడకలో స్థిరత్వం లేకపోవడం లాంటివి ఈ వ్యాధి లక్షణాలను వివరించారు. కేవలం శారీరక కదలికలే కాకుండా నిద్రలేని, మానసిక ఒత్తిడి, జ్ఞాపక శక్తి తగ్గడం వంటి సమస్యలు కూడా రోగుల్లో కనిపిస్తాయని పేర్కొన్నారు. వ్యాధి ముదిరిన దశలో ఉన్న రోగుల కోసం ” డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ” ( DBS ) వంటి అత్యాధునిక చికిత్సలను నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో తాము అందుబాటులోకి తీసుకోచ్చినట్లు డాక్టర్ బింధుమీనన్ వెల్లడించారు. ఈ చికిత్స ద్వారా రోగుల శారీరక కదలికలలో గణనీయమైన మార్పు రావడమే కాకుండా, వారు వాడే మందుల మోతాదును తగ్గించి, రోగి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తామని తెలియజేశారు. ” ఇంటర్నేషనల్ పార్కిన్సన్ అండ్ మూవ్‌మెంట్ డిజార్డర్ సొసైటీ ” ద్వారా తాము ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా అవగాహన, ముందస్తు రోగ నిర్ధారణ మరియు బహుళ విభాగాల సంరక్షణను ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. “మెరుగైన మెదడు ఆరోగ్యం మరియు బలమైన సమాజం వైపు మనమందరం కలిసి అడుగులు వేద్దాం” అని డాక్టర్ బిందు మీనన్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పార్కిన్సన్ రోగులకు అండగా నిలుస్తూ, పరిశోధనలు మరియు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ డాక్టర్ బిందు భార్గవి రెడ్డి, డాక్టర్ రష్మీ, డాక్టర్ శివశంకర్, డాక్టర్ వెంకట్ మరియు వైద్యులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Read Previous

ప్రజల ఆరోగ్యమే దేశానికి నిజమైన శక్తి : అపోలో హాస్పిటల్స్ ఛైర్మైన్ డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి

Read Next

నెల్లూరుజిల్లాలో రోడ్డు ప్రమాదం : హైదరాబాద్ వాసులకు గాయాలు

Leave a Reply

Your email address will not be published.