సూళ్లూరుపేటలో దొంగల ముఠా హల్ చల్ : చోరీకి విఫలయత్నం

Clock Of Nellore ( Sullurpeta ) – తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట, తడ ప్రాంతాల్లో గత అర్ధరాత్రి దొంగల ముఠా హల్ చల్ చేసింది. రెండు ప్రాంతాల్లోని పలు దుకాణాల్లో చోరీకి విఫలయత్నం చేశారు. తమిళనాడుకు చెందిన 5 మంది దొంగలు గత అర్ధరాత్రి తడలో పలు దుకాణాల వద్ద రెక్కీ నిర్వహించారు. దుకాణాల్లో చోరీ చేసేందుకు ప్రయత్నించగా వీలు పడలేదు. తర్వాత సూళ్లూరుపేట పట్టణానికి చేరుకున్నారు. కోళ్లమిట్ట వద్ద మోర్ సూపర్ మార్కెట్ తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అద్దాలు పగులగొట్టారు. నగదు కోసం వెదుకుతుండగా రాత్రి గస్తీ బృందానికి అనుమానం వచ్చి సూళ్లూరుపేట ఎస్సై రవిబాబుకు సమాచారం అందించారు. ఎస్సై అక్కడకు చేరుకునే సమయానికి దొంగలు పరారయ్యే ప్రయత్నం చేశారు. అయినప్పటికి పోలీసులు వారిని వెంబడించారు. నలుగురు పారిపోగా ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Previous

ఫేస్ బుక్ పోస్టింగ్ : నెల్లూరులో యువకుడి అరెస్ట్

Read Next

ఈ ప్రభుత్వాన్ని ప్రజలు శాశ్వతంగా డిస్మిస్ చేస్తారు : ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Leave a Reply

Your email address will not be published.