పడుగుపాడు పంచాయితీని అభినందించిన కలెక్టర్ చక్రధర్ బాబు

Clock Of Nellore ( Nellore ) – విద్యుత్ పొదువు ప్రత్యామ్నాయ వనరుల సమీకరణ అంశంలో భాగంగా రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని సాధించిన కోవూరు మండలం, పడుగుపాడు గ్రామ పంచాయతీని నెల్లూరు కలెక్టర్ చక్రధర్ బాబు అభినందించారు. విద్యుత్ పొదుపు ప్రత్యామ్నాయ వనరుల సమీకరణలో భాగంగా పడుగుపాడు పంచాయతీ సచివాలయంలో సోలార్ వ్యవస్థతో పాటు బ్యాటరీ ఆటోను, సోలాట్ లైట్ల ను ఏర్పాటు చేయడం వలన రాష్ట్ర స్థాయి పురస్కారానికి ఎంపిక కాబడి ఈ నెల 20వ తేదీన విద్యుత్ శాఖ వారు విజయవాడలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఇంచార్జి డి.పి.ఓ చిరంజీవి, పడుగుపాడు గ్రామ ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఎనర్జీ అసిస్టెంట్ లతో కలసి అవార్డును అందుకోవడం జరిగింది. విజయవాడలో అవార్డు స్వీకరించిన ఇంచార్జి డిపిఓ చిరంజీవి, పడుగుపాడు గ్రామ ఉప సర్పంచ్ ఎస్. కె. అహ్మద్, పంచాయతీ కార్యదర్శి కృష్ణమూర్తి లతో కలసి గురువారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇంచార్జి డిపిఓ చిరంజీవిని, పడుగుపాడు గ్రామ ఉప సర్పంచ్ ఎస్. కె. అహ్మద్, పంచాయతీ కార్యదర్శి కృష్ణమూర్తిలను జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ప్రత్యేకంగా అభినందించారు.

Read Previous

నెల్లూరు కార్పొరేషన్ లో ప్రీ క్రిస్మస్ వేడుకలు : హాజరైన మేయర్ స్రవంతి

Read Next

నెల్లూరు అపోలో హాస్పిటల్ లో అందుబాటులోకి వచ్చిన మోకాలి రోబోటిక్ సర్జరీ

Leave a Reply

Your email address will not be published.