Clock Of Nellore ( Kuwait ) – ఏ దేశంలో ఉన్నా ప్రవాసాంధ్రులు ఇబ్బందులు పడకూడదు, క్షేమంగా ఉండాలన్న సంకల్పంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీని స్థాపించారని ఆ సొసైటీ ఛైర్మైన్ మేడపాటి వెంకట్ అన్నారు. కువైట్ లో ఇబ్బందులు పడుతున్న అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ మహిళను క్షేమంగా స్వదేశానికి పంపిన APNRTS కువైట్ కమిటీని, కువైట్ వైసీపి కమిటి సభ్యులను ఆయన అభినందించారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం, మంగంపేటకు చెందిన పెంచలమ్మ జీవనోపాధి కోసం కువైట్ వెళ్లింది. ఇటీవల ప్రమాదవ శాత్తూ కింద పడగా చేయి విరిగింది. అప్పటి నుండి కువైట్ లో జీవనోపాధి లేక స్వదేశానికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతుంది. ఈ క్రమంలో కువైట్ లోని వైసీపి కన్వీనర్ ముమ్మిడి బాలిరెడ్డిని కలిసి తన సమస్యలను వివరించింది. మానవతా దృక్పదంతో వ్యవహరించిన బాలిరెడ్డి పెంచలమ్మ ఇండియా వెళ్లే వరకూ ఆమె ఉండేందుకు ఇల్లు, భోజన సదుపాయాలు కల్పించారు. ఆమె పరిస్థితిని తెలుసుకున్న APNRTS రీజనల్ కో – ఆర్డినేటర్ నాయని మహేష్ రెడ్డి, వైసీపి సభ్యులు ఎం. చంద్రశేఖర్ రెడ్డి, పి. సురేష్ కుమార్ రెడ్డి, ఏ. సుబ్బారెడ్డి, శివశంకర్ రెడ్డి, హనుమంత రెడ్డి, మణి వీరంతా కువైట్ నుండి ఇండియాకు విమాన టిక్కెట్ ను, దారి ఖర్చులకు 20వేల రూపాయలను పెంచలమ్మకు అందజేశారు.

ఈనెల 18వ తేదీనా అల్ జజీరా ఎయిర్ వేస్ విమానం ద్వారా బయలుదేరి నిన్న అనగా 19వ తేదీనా క్షేమంగా స్వస్థలమైన అన్నమయ్య జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఛైర్మైన్ మేడపాటి వెంకట్, డైరెక్టర్ ఇలియాజ్ మాట్లాడుతూ APNRTS కువైట్ కమిటీ, కువైట్ వైసీపి కమిటి సభ్యుల సేవలు అభినందనీయమని కొనియాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మార్గదర్శకంలో నిత్యం ప్రవాసాంధ్రుల క్షేమం, సంక్షేమం కోసం కృషి చేస్తూ కువైట్ లో తెలుగు వారికి అండగా ఉంటున్న ముమ్మడి బాలిరెడ్డి, నాయిని మహేశ్వర్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. సురక్షితంగా ఇంటికి చేరిన పెంచలమ్మ మాట్లాడుతూ వైసీపి కువైట్ కమిటి కన్వీనర్ బాలిరెడ్డికి, కమిటి సభ్యులు మహేశ్వర్ రెడ్డికి, APNRTS ఛైర్మైన్ మేడపాటి వెంకట్ కు, డైరెక్టర్ బి.హెచ్. ఇలియాజ్ కు, సిఈఓ దినేష్ కుమార్ కు, సిఎం జగన్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని వైసీపి గల్ఫ్ దేశాల మీడియా కో – ఆర్డినేటర్ షేక్ గౌస్ బాషా తెలియజేశారు.