Clock Of Nellore ( Nellore ) – క్రికెట్ బెట్టింగ్ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న కృష్ణసింగ్ ఇంకా ఆ వృత్తిని వదులుకోలేదు. బెట్టింగ్, పేకాటే, ఇతర జూదాల నిర్వహణే జీవితంగా ముందుకెళుతున్నాడు. తాజాగా సోమవారం రాత్రి నెల్లూరులో కృష్ణసింగ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ పేకాట స్థావరంపై విశ్వసనీయంగా వచ్చిన సమాచారం మేరకు బాలాజీ నగర్ పోలీసులు దాడులు నిర్వహించారు. నగరంలోని రామలింగాపురం వద్ద రైల్వే అండర్ బ్రిడ్జిని ఆనుకుని ఉన్న ఓ నివాసంలో నిత్యం పేకాట జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నగర డిఎస్పీ శ్రీనివాసులు రెడ్డి, బాలాజీనగర్ సిఐ రాములు నాయక్ తన బృందంతో సోమవారం రాత్రి ఆ నివాసంపై రైడ్ చేశారు. దీంతో పేకాట రాయుళ్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. అందులో కృష్ణసింగ్ కూడా ఉన్నాడు. మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్న బాలాజీనగర్ పోలీసులు వారిని స్టేషన్ కు తరలించారు. సుమారు 3 లక్షల రూపాయల వరకూ సీజ్ చేసినట్లు తెలిసింది.
