Clock Of Nellore ( Nellore ) – జీవితంలో ఇక నడవలేనని కుంగుబాటుకు గురైన ఓ వ్యక్తికి నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ వైద్యులు అరుదైన ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించి ఆయన జీవితంలో సంతోషాన్ని నింపారు. వారి కుటుంబసభ్యులకు ఆనందాన్ని అందించారు. వివరాల్లోకి వెళితే… తిరుపతిజిల్లా గూడూరుకు చెందిన 65 ఏళ్ల నరసింహులు అనే వ్యక్తికి ఐదేళ్ల క్రితం కుడికాలు మోకీలు నొప్పి వచ్చింది. ఎంతో మంది వైద్యులను కలిసినా ఉపశమనం కలగలేదు. చెన్నై, బెంగుళూరు, కడపలోని ప్రముఖ హాస్పిటల్స్ కు వెళ్లినా ఫలితం లేదు. ఆపరేషన్ చేయాల్సి రావడం, అది కూడా ఖచ్చితంగా చేయకపోతే కాలు సరిగా రాదు అన్న భయంతో ఆపరేషన్ చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో నరసింహులు తాను ఇక జీవితంలో నడవలేనేమో అనే కుంగుబాటుతో ఉండగా వారి కుటుంబసభ్యులు ఇటీవల నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్ కు తీసుకొచ్చారు. హాస్పిటల్ ఎముకలు, కీళ్ల శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ కె. శశిధర్ రెడ్డి రోగిని పరీక్షించి మోకీళ్లు కూడా అరిగి పోయి ఉన్నాయని గుర్తించారు. దానికి తోడు రోగికి స్కెల్టన్ తరోసిన్ అనే వ్యాధి కూడా ఉండటంతో దాని కారణంగా మోకాళ్ల దగ్గర ఎముకలు దెబ్బతిని 20 శాతం మాత్రమే కాలులో కదలికలు ఉన్నాయి. దీంతో కాళ్లు నిటారుగా కాకుండా వంగినట్లు ఉన్నాయి. ఆపరేషన్ సమయంలో లిగమెంట్స్ తెగిపోకుండా అత్యంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.

అన్నీ పరీక్షలు పూర్తయిన తర్వాత హాస్పిటల్ సెంటర్ హెడ్ డాక్టర్ గణేష్ పర్యవేక్షణలో డాక్టర్ శశిధర్ రెడ్డి ఆపరేషన్ ను మొదలు పెట్టారు. రోగికి జనరల్ అనస్తీషియా ఇచ్చి, ఎంతో అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం రోగి నరసింహులు పూర్తిగా కోలుకున్నారు. కాళ్ల వంకర పూర్తిగా తొలగి, నిటారుగా నిలబడుతున్నారు. మోకాళ్ల నొప్పులు పూర్తిగా మాయమయ్యాయి. ఈ సందర్భంగా మంగళవారం మెడికవర్ హాస్పిటల్ లో డాక్టర్ శశిధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి ఆపరేషన్ ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ ఆపరేషన్ చేసేందుకు చాలా మంది డాక్టర్ వెనకడుగు వేస్తారని చెప్పారు. ఆపరేషన్ సమయంలో ఏ ఒక్క చిన్న తప్పు జరిగినా శాశ్వతంగా రోగి నడవలేని స్థితికి చేరుకుంటారని, మెడికవర్ హాస్పిటల్ లో ఉన్న అత్యాధునికి వైద్య పరికరాల సహాయంతో శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు తెలియజేశారు. మోకాళ్ల నొప్పులకు సంభందించి ఏ సమస్యలు ఉన్నా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పనిలేదని, నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ లో మోకాళ్లకు సంభందించిన వైద్యానికి అత్యాధునికి వైద్య పరికరాలతో పాటూ నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నారని డాక్టర్ శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. రోగి నరసింహులు మాట్లాడుతూ తాను జీవితంలో ఇక నడవలేనని మానసికంగా ఎంతో వేదనను అనుభవించానని, మెడికవర్ హాస్పిటల్ వైద్యుల సహకారంతో నడవగలుగుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. హాస్పిటల్ సెంటర్ హెడ్ డాక్టర్ గణేష్ కు, ఇతర వైద్యులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
