బలహీన పడ్డ వాయుగుండం : దక్షిణ కోస్తాంధ్రకు వర్ష సూచన

Clock Of Nellore ( Delhi ) – నైరుతీ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం బలహీన పడింది. పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తున్న వాయుగుండం మంగళవారం ఉదయం స్వల్ప అల్పపీడనంగా మారింది. ఇది ఉత్తర తమిళనాడు – దక్షిణ కోస్తాంధ్ర వైపు కదులుతున్నట్లు భారత వాతావరణ శాఖ తెలియజేసింది. దీనికి తోడు అదే ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరో 24 గంటల్లో స్వల్ప అల్పపీడనం కూడా మరింత బలహీన పడుతుందని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో రెండు రోజుల పాటూ ఓ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. కొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తుందని పేర్కొన్నారు.

Read Previous

శరత్ చంద్రారెడ్డిని చెవిరెడ్డి ఎందుకు కలిశారు : ప్రశ్నించిన ఆనం

Read Next

జెన్ కో ను అధానీకి అప్పగిస్తే ఊరుకోం : ప్రభుత్వాన్ని హెచ్చరించిన సోమిరెడ్డి

Leave a Reply

Your email address will not be published.