శరత్ చంద్రారెడ్డిని చెవిరెడ్డి ఎందుకు కలిశారు : ప్రశ్నించిన ఆనం

Clock Of Nellore ( Nellore ) – దోవోస్ కు వెళ్లి జగ్గూభాయ్ ఏం చేశారని, బేగంపేట ఎయిర్ పోర్టు నుంచే వెళ్లాల్సిన అవసరం ఏమిటని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన నెల్లూరులోని టిడిపి జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గన్నవరం ఎయిర్ పోర్టులో స్పెషల్ ఫ్లైట్ ల్యాండ్ కాదా ? అని ప్రశ్నించారు. పెద్ద ఎత్తున నల్లధనం, బంగారం తరలించేందుకే బేగంపేట నుంచి వెళ్లారని విమర్శించారు. జగ్గూభాయ్ దావోస్ పర్యటనలో మూడు రోజులు మాయమయ్యారని, అరబిందో వాళ్లని జగ్గూభాయ్ కలిశారా ? లేదా ? అని ప్రశ్నించారు. జగ్గూభాయ్ మాఫియాతో మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధాలున్నాయన్నారు.

ఈడీ విచారణలో రిమాండ్ ఖైదీగా ఉన్న శరత్ చంద్రారెడ్డిని, ఎమ్మెల్యే చెవిరెడ్డి ఎందుకు కలిశారని వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. బాబాయ్‌ని చంపిన గొడ్డలికి ఇంకా రక్తం మరకలు ఆరలేదని బెదిరించడానికా, జగ్గూభాయ్.. అమిత్ షా కాళ్లుపట్టుకుని అయినా కాపాడతాడని చెప్పడానికా ? అని ప్రశ్నించారు. రిమాండ్ ఖైదీగా ఉన్న శరత్ చంద్రారెడ్డితో, ఎమ్మెల్యే చెవిరెడ్డిని ఈడీ, సీబీఐ అధికారులు ఎలా కలవనిస్తారని ప్రశ్నించారు. శరత్ చంద్రారెడ్డి ప్రాణాలకి జగ్గూభాయ్ మాఫియా వల్ల ప్రాణహాని ఉందని, ఈడీ, సీబీఐ అధికారులు వెంటనే జెడ్ క్యాటగిరీ సెక్యూరిటీ కల్పించాలన్నారు. మద్యం గురించి అడిగితే, హెరిటేజ్ పాల గురించి మాట్లాడతారని.. మద్యానికి, పాలకి ఏమైనా సంబంధం ఉందా ? అంటూ మండిపడ్డారు. అదానీ డిస్టలరీస్ నుంచి రూ.వందకోట్లు చేబదులు ఎందుకు తీసుకున్నారని ఆనం వెంకటరమణారెడ్డి నిలదీశారు.

Read Previous

హిమాలయ పర్వతం ఎక్కిన ” కోటంరెడ్డి అభిమానం “

Read Next

బలహీన పడ్డ వాయుగుండం : దక్షిణ కోస్తాంధ్రకు వర్ష సూచన

Leave a Reply

Your email address will not be published.