డ్రోన్ల పైలెట్లకు సర్టిఫికేట్లు : అందజేసిన కలెక్టర్ చక్రధర్ బాబు

Clock Of Nellore ( Nellore ) – నిరుద్యోగ యువతకు నైపుణ్యాలను పెంపొందించి తద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. గురువారం నెల్లూరులోని డి.కె.డబ్ల్యూ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవెలప్మెంట్ ఆఫ్ మైనార్టీస్ ఆధ్వర్యంలో డ్రోన్ పైలట్లగా శిక్షణ పొందిన వారికి జిల్లా కలెక్టర్ సర్టిఫికేట్లను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నిరుద్యోగ యువతకు నైపుణ్యాలను పెంపొందించి తద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో డ్రోన్ టెక్నాలజీలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం డ్రోన్ టెక్నాలజీని వ్యవసాయ రంగంలోనూ, డోరు డెలివరీలోను, రీ సర్వే కార్యక్రమాల్లో, అటవీ సంరక్షణలో వినియోగించడం జరుగుచున్నదన్నారు. నేడు జిల్లాలో 115 గ్రామాల్లో రీ సర్వే కార్యక్రమం పూర్తి చేయడం జరిగిందన్నారు. పరిశ్రమల్లో, పోర్టుల్లో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. అందుకనుగుణంగా అవసరమైన శిక్షణా కార్యక్రమాలను అమలు చేస్తూ జాబ్ మేళాలు నిర్వహించి నిరుద్యోగ యువతికి ఉద్యోగాలు కల్పించడం జరుగుచున్నదన్నారు.

అందులో భాగంగా డిస్ట్రిక్ట్ స్కిల్ డెవెలప్మెంట్ ప్లాన్ ను తయారుచేయడం జరిగిందన్నారు. జాబ్ మేళా కార్యక్రమాలు ద్వారా గ్రామీణ ప్రాంతాల యువత దగ్గరకి కంపెనీ ప్రతినిధులను తీసుకొచ్చి ఉపాధి కల్పించి వారి యొక్క భవిష్యత్తుకి మంచి అవకాశాలు చూపించడం జరుగుతుందని తెలిపారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం చదువుతున్న సమయంలోనే యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు విషయ అవగాహనతో పాటు సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన కలిగేలా ఇంటర్ షిప్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. నేడు మహిళలు అన్నీ రంగాల్లో ముందంజులో వున్నారని, ప్రతి రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న శిక్షణా కార్యక్రమాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్ధిని ఇతరులకు ఆదర్శంగా నిలిచి ఓటర్ గా తమ పేరును నమోదుచేసుకోవాలని ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్, విద్యార్ధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ విద్యాధరి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కనక దుర్గ భవాని, జిల్లా ఉపాధి కల్పన అధికారి సురేష్ బాబు, డి.కె.డబ్ల్యూ. కళాశాల ప్రిన్సిపాల్ గిరి, శిక్షణ పొందిన డ్రోన్ పైలెట్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Read Previous

విద్యార్ధులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన నెల్లూరు జడ్ఫీ ఛైర్ పర్సన్ ఆనం

Read Next

నెల్లూరు సిటీ, కావలి డిఎస్పీల బాధ్యతల స్వీకరణ

Leave a Reply

Your email address will not be published.