VSU లో ఘనంగా జరిగిన వైస్ – ఛాన్సలర్ సుందరవల్లి జన్మదిన వేడుకలు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్శిటీ వైస్ – ఛాన్సలర్ సుందరవల్లి జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. యూనివర్శిటీలో పరిశోధక విద్యార్ధులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా వైస్ – ఛాన్సలర్ సుందరవల్లి కేక్ కట్ చేశారు. అందరూ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ జిల్లాల నుండి ఈ వేడుకలకు పూర్వ విద్యార్ధులు హాజరయ్యారు. జన్మదిన వేడుకల అనంతరం ఆమె జనని వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. జన్మనిచ్చిన తల్లి దండ్రులు దైవంతో సమానమని వారిని గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలపై ఉందని గుర్తు చేశారు. అంతకు ముందు ఆమె యూనివర్శిటీలో మాట్లాడుతూ తనను ఓ అధికారిగా కాకుండా కుటుంబసభ్యునిగా భావించి ఆధరాభినాలతో ఉండాలని కోరారు. యూనివర్శిటీకి NAAC గుర్తింపు వచ్చేందుకు ప్రతీ ఒక్కరం కష్టపడతామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో రిజిస్ట్రార్ డాక్టర్ పి. రామచంద్రారెడ్డి, సుజా ఎస్ నాయర్, డాక్టర్ ఆర్. మధుమతి తదితరులు పాల్గొన్నారు.

Read Previous

ఘనంగా ఎంపి ఆదాల జన్మదిన వేడుకలు : శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యేలు

Read Next

ఖరారైన సిఎం జగన్ నెల్లూరు జిల్లా పర్యటన : ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి కాకాణి

Leave a Reply

Your email address will not be published.