Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. నెల్లూరులోని వారి నివాసానికి వెళ్లిన పలువురు ప్రముఖులు, వైసీపి నేతలు, ఎమ్మెల్యేలు పుష్ప గుచ్చాలు అందజేసి ఆదాలకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్, వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నుడా ఛైర్మైన్ ముక్కాల ద్వారకానాథ్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, వైసీపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైవి రామిరెడ్డి, ఇతర నేతలు ఆదాలను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మరో వైపు తన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరులోని విశ్వభారతి అంధుల పాఠశాలకు లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించారు. దానికి సంభందించిన చెక్కును విజయడైరీ ఛైర్మైన్ కొండ్రెడ్డి రంగారెడ్డి పాఠశాల యాజమాన్యానికి అందజేశారు.
