గణేష్ నిమజ్జనానికి అన్నీ వసతులు : నిమజ్జన ఘాట్ పరిశీలించిన మంత్రి కాకాణి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరంలో గణేష్ ఉత్సవాల నేపద్యంలో ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన నిమజ్జన ఘాట్ వద్ద అన్నీ సౌకర్యాలు కల్పిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. సోమవారం నూతనంగా నిర్మించిన గణేష్ నిమజ్జన ఘాట్ ను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తో కలసి పరిశీలించారు. తక్కువ సమయంలో వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు సంయుక్తంగా కృషి చేసి పూర్తి చేసినందుకు సంతృప్తి వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు. అదేవిధంగా నెల్లూరు నగరంలో అభివృద్ధి ఒకరోజుతో, ఒక కార్యక్రమంతో అయినట్టు కాదని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో నిరంతరం కొనసాగిస్తామని తెలియజేశారు. వినాయక చవితి పండుగ సంధర్భంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రతిసారీ నిర్వహించే పెన్నా నదిలో కాకుండా ఇరుకళల అమ్మవారి గుడి సమీపంలో నెల్లూరు చెరువు వద్ద నిర్వహించాలని ఆగస్టు 18న జరిగిన సమావేశంలో అధికారులు, ప్రజా ప్రతినిధులoదరూ కలసి నిర్ణయించగా, కొద్ది రోజుల వ్యవధిలో పండుగకు రెండు రోజుల ముందుగానే సుందరంగా గణేష్ నిమజ్జన ఘాట్ ను నిర్మించారని కొనియాడారు. ఇందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జరిపిన నిరంతర పట్టుదల, కృషి వల్లే సాధ్యపడిందన్నారు. అదేవిధంగా విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ కోరిక మేరకు విగ్రహ నిర్వాహకులకు అన్ని అనుమతులకు సింగిల్ విండో విధానం అమలు చేశామన్నారు. అదేవిధంగా అడిగిందే తడవుగా గణేష్ నిమజ్జన ఘాట్ నిర్మాణ పనులకు తమ వంతు సాయం చేసిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి , నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాధ్ లకు తమ ధన్యవాదాలన్నారు.

ఈ సంధర్భంగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, విగ్రహ నిర్వాహకులoదరూ అధికారులు సూచించిన విధంగా అన్ని అనుమతులు తీసుకుని సహకరించాలన్నారు. వినాయక విగ్రహాలన్నింటిని ఒకేసారి సెప్టెంబర్ 4 వ తేదీన అత్యంత వైభవంగా నిమజ్జనం చేయడం జరుగుతుందని, కావున విగ్రహ నిర్వాహకులందరూ గమనించాలన్నారు. అదే విధంగా రాబోయే రోజుల్లో ఇరుకళల అమ్మవారి గుడి సమీపంలోని ప్రాంతాలను మరితగా అభివృద్ధి చేసి పర్యాటకంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ స్రవంతి, నగర పాలక సంస్థ కమీషనర్ హరిత, విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి , కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read Previous

నకిలీ ఈడి అధికారులను అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు…

Read Next

12వ డివిజన్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తా : మేయర్ స్రవంతి

Leave a Reply

Your email address will not be published.