సిఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జలతో కోటంరెడ్డి సోదరులు భేటీ…

Clock Of Nellore ( Amaravathi ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి… ఆయన సోదరుడు, వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఇద్దరూ ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్ ను కలిసి పుష్ప గుచ్ఛం అందజేశారు. పలు అంశాలపై సిఎంతో చర్చించారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని సిఎం అడిగి తెలుసుకున్నారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు శ్రీధర్ రెడ్డి సమాధానం ఇవ్వగా, జాగ్రత్తగా ఉండాలని పలు సూచనలు చేశారు. రూరల్ నియోజకవర్గంలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని సిఎం అభినందించారు. అనంతరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని, అలాగే కొత్త పనులు మంజూరు చేయాలని సిఎంకు వినతి పత్రం సమర్పించారు. తర్వాత ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా కోటంరెడ్డి సోదరులు మర్యాద పూర్వకంగా కలిసి, కొద్ది సేపు చర్చించారు.

Read Previous

అంతరిక్షంలోకి బాలికల ప్రతిభ… ఆగస్టు మొదటి వారంలో కక్ష్యలోకి

Read Next

నెల్లూరుజిల్లాలో ఇద్దరు ఏఎస్పీలకు ఎస్పీలుగా పదోన్నతి…

Leave a Reply

Your email address will not be published.