Clock Of Nellore ( Nellore ) – రాష్ట్ర వ్యాప్తంగా పలువురు అదనపు ఎస్పీలకు నాన్ క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ( Nellore Police ) . నెల్లూరు జిల్లాకు సంభందించి ఇద్దరు అదనపు ఎస్పీలు ఎస్పీలుగా పదోన్నతి పొందారు. ఈ ఏడాది మే నెలలో జిల్లా అదనపు ఎస్పీ ( అడ్మిన్ ) గా వచ్చిన డి. హిమవతి, నేర విభాగం అదనపు ఎస్పీగా వచ్చిన డి. చౌడేశ్వరి ఈ జాబితాలో ఉన్నారు. 2021 – 2022 సంవత్సరానికి గానూ పలువురు అదనపు ఎస్పీలను నాన్ క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతి కల్పించేందుకు పేర్లతో కూడిన జాబితాను హోం శాఖ ప్యానల్ కు పంపగా, ప్యానల్ ఆ జాబితాను ఆమోదించింది. ఎస్పీలుగా పదోన్నతి పొందిన అదనపు ఎస్పీలంతా ప్రస్తుతానికి అదే పోస్టుల్లో కొనసాగుతారు. తర్వాత వారికి కొత్తగా పోస్టింగులు కేటాయించనుంది ప్రభుత్వం.
Tags: AP Police ASP To Sp Promotions Nellore ASP Himavathi Nellore Crime Asp Chawdeswari Nellore police