Clock Of Nellore ( Atmakur ) – ఆత్మకూరులో జరిగే ఉప ఎన్నికలకు సంభందించిన బిజేపి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఆ పార్టీ అభ్యర్ధి భరత్ కుమార్ యాదవ్ ను గెలిపించాలని కోరుతూ బిజేపి దాని అనుబంధ సంఘాలు నియోజకవర్గంలో ప్రచారాన్ని చేపట్టాయి. ఇందులో భాగంగా భారతీయ జనతా యువమోర్చా నెల్లూరుజిల్లా అధ్యక్షులు యశ్వంత్ సింగ్ ఠాకూర్ ఆత్మకూరులో ప్రచారాన్ని చేపట్టారు. యువమోర్చా సభ్యులతో కలిసి నియోజకవర్గంలోని ఆత్మకూరు, ఏఎస్ పేట, సంగం తదితర ప్రాంతాల్లో పర్యటించి బిజేపి అభ్యర్ధి భరత్ కుమార్ యాదవ్ కు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. బిజేపి అభ్యర్ధిని గెలిపిస్తే ప్రధాని నరేంద్రమోడీ సారధ్యంలో నియోజకవర్గాన్ని అన్నీ విధాలా అభివృద్ధి చేస్తారని చెప్పుకొచ్చారు.
