Clock Of Nellore ( Nellore ) – అత్యాధునిక వైద్య పరికరాలు, నిపుణులైన స్పెషలిస్ట్ ల చే రోగులకు మెరుగైన ఆరోగ్య సేవలు అందిస్తూ బెస్ట్ హాస్పిటల్ గా ఇప్పటికే పలు అవార్డులు అందుకున్న నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్… ప్రజల కోసం మరో సేవను ప్రారంభించింది ( Nellore Medicover Hospital ). అన్నీ ఆరోగ్య సేవలు ఇంటి వద్దకే అందించే ప్రక్రియను ఆరంభించింది. నెల్లూరులోని ఏ హాస్పిటల్ లో లేని విధంగా రూపొందించిన ఈ నూతన సేవలకు సంభందించిన బ్రోచర్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరులోని వారి నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ డాక్టర్ గణేష్ ను అభినందించారు. వివిధ రకాల అనారోగ్యాలతో బాధపడే వారు హాస్పిటల్ కు వెళ్లేందుకు ఇబ్బంది పడుతుంటారని, అలాంటి వారికి ఈ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు.

అనంతరం హాస్పిటల్ సెంటర్ హెడ్ డాక్టర్ గణేష్ మాట్లాడుతూ నర్సింగ్, శాంపిల్ కలెక్షన్, ఫిజియోథెరఫి, డైటీషియన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. 040 – 68334455 నంబర్ కు ఫోన్ చేస్తే మెడికవర్ హాస్పిటల్ వైద్య సేవలు ఇంటి వద్దకే వస్తాయన్నారు. అంతే కాకుండా 500 రూపాయలకు మించి కొనుగోలు చేసే మందులను కూడా ఉచితంగా డోర్ డెలివరీ ఇస్తామన్నారు. నెల్లూరు వాసులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మార్కెటింగ్ మేనేజర్ ఉదయ భాస్కర్, మార్కెటింగ్ మేనేజర్ మధుసూదన్, పిఆర్వో చందు వర్మ పాల్గొన్నారు.
