బ్రెయిన్ ట్యూమర్ ను తొలి దశ లోనే ఎదుర్కొందాం : డాక్టర్ దినేష్ గంగ పట్నం

Clock Of Nellore ( Nellore ) – భారతదేశంలో ప్రతి సంవత్సరం 28 వేల మంది బ్రెయిన్ ట్యూమర్ బారిన పడుతున్నారని మెడికవర్ హాస్పిటల్ న్యూరో సర్జన్ డాక్టర్ దినేష్ గంగపట్నం ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతి బ్రెయిన్ ట్యూమర్ క్యాన్సర్ కాదు. దీనిలో 50% క్యాన్సర్ గాని గడ్డలు ఉంటాయి. కాబట్టి బ్రెయిన్ ట్యూమర్ రోగి చనిపోతారు అనుకోవడం అపోహ మాత్రమే.ఇవి రావడానికి నిర్దిష్ట కారణాలు అంటూ ఏమీ లేవు.జన్యుపరమైన కారణాలు, లేదా రోగ నిరోధక శక్తి తగ్గిపోయినప్పుడు కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల ఖచ్చితంగా వస్తాయి అని చెప్పలేము. కానీ రిస్కు ఎక్కువ అని చెప్పొచ్చు. ఇవి సాధారణంగా రెండు రకాలు. 1 . ప్రైమరీ అంటే మెదడులో కణాల నుంచి వచ్చే క్యాసర్. 2. శరీరంలో మిగతా అవయవాల నుండి మెదడుకు వ్యాప్తి చెందినప్పుడు వచ్చేవి.

లక్షణాలు:- తలనొప్పి రావడం, ఉదయం ఎక్కువ సార్లు వాంతులు అవ్వడం, అకస్మాత్తుగా ఫిట్స్ రావడం, హార్మోన్ల ఇబ్బందులు శరీరంలో ఒకవైపు పని చేయకపోవడం, నడిచేటప్పుడు లయ తప్పడం ఇలాంటివి జరిగినప్పుడు , వెంటనే డాక్టర్ ను సంప్రదించవలెను.CT బ్రెయన్ లేదా MRI బ్రెయిన్ ద్వారా వీటిని గుర్తించగలం. సాధారణంగా మెదడులో ఏ భాగం లో ట్యూమర్ వచ్చిoదో దాన్ని బట్టి చికిత్స అనేది జరుగుతుంది. మెదడు పైభాగంలో గడ్డలను ఆపరేషన్ వల్ల మొత్తంగా తీసివేయడం జరుగుతుంది. అదే లోపలి భాగాల్లో వచ్చినప్పుడు బయాప్సి లేదా డీబల్కింగ్ సర్జరీ (కొంత భాగం తీసి పరీక్షకు పంపడం జరుగుతుంది).

తర్వాత క్యాన్సర్ స్టేజ్ ని ఆధారం చేసుకుని కీమోథెరపీ, రేడియోథెరపీ అనేవి ఇవ్వడం జరుగుతుంది. బ్రెయిన్ ట్యూమర్స్ లో giloblastama అనేది అత్యంత ప్రమాదకరం. స్టేజి ఫోర్ క్యాన్సర్ కొన్ని రకాల బ్రెయిన్ ట్యూమర్ ని మనం ముక్కు ద్వారం నుండి కూడా కోత లేకుండా ఆపరేషన్ చేయడం జరుగుతుంది. పిట్యూటరీ ట్యూమర్స్ క్రీనియోఫెరింజియోమా వాటికి ఎండోస్కోపి సర్జరీ చేయవచ్చు. ఎటువంటి అనుమానం వచ్చిన, పైన చెప్పబడిన లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే న్యూరో సర్జన్ ను సంప్రదించాలని మెడికవర్ హాస్పిటల్ న్యూరో సర్జన్ డాక్టర్ దినేష్ గంగపట్నం తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ డాక్టర్ గణేష్ మాట్లాడుతూ నెల్లూరులో క్యాన్సర్ కారకమైన ఎటువంటి వ్యాధి అయినా నిర్ధారణ చేసుకొని వేగవంతంగా అత్యాధునిక వైద్య చికిత్సలు అందుకునేందుకు వీలుగా మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతాల వారికే కాకుండా ఇతర రాష్ట్రాల వారు సైతం నెల్లూరుకు వచ్చి మెడికవర్ లో నాణ్యమైన వైద్య సేవలు అందుకుoటున్నారని తెలిపారు. వ్యాధి నిర్ధారణ చేసుకున్న వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి వ్యాధి నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు ఉత్తమమైన వైద్య సేవలు అందించేందుకు అనుభవజ్ఞులైన వైద్యులు కలిగిన మెడికవర్ హాస్పిటల్ లో 24×7 వైద్య సేవలు అందిస్తూ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది, పి ఆర్ఓ చందు వర్మ తదితరులు పాల్గొన్నారు.

Read Previous

తిరుమలకు చేరుకున్న నెల్లూరు మేయర్ దంపతులు… రేపు శ్రీవారి దర్శనం

Read Next

కోర్టు వివాదాలను త్వరితగతిన పరిష్కరించండి – కమిషనర్ జాహ్నవి

Leave a Reply

Your email address will not be published.