Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో నమోదైన కోర్టు కేసుల పరిష్కారానికి అవసరమైన అన్ని దస్త్రాలను సంభందిత కోర్టలకు అందజేసి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని టౌన్ ప్లానింగ్ అధికారులను కార్పొరేషన్ కమిషనర్ జాహ్నవి ఆదేశించారు. కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ లో టౌన్ ప్లానింగ్ అధికారులతో కమిషనర్ గురువారం కోర్టు వివాదాల అంశంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వ్యక్తిగత స్థల వివాదాలు, హద్దుల మధ్య వివాదాలు, నగర పాలక సంస్థ ఆస్తుల ఆక్రమణలు, అనుమతులు లేని కట్టడాలు వంటి వివిధ వివాదాలకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు వారు సూచించిన సమయానికి అందజేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. వారం లోపు సుమారు 40 వరకు లీగల్ వివాదాలను పరిష్కరించేందుకు టౌన్ ప్లానింగ్ విభాగం సిద్ధంగా ఉండాలని కమిషనర్ సిబ్బందిని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఇంఛార్జ్ డి.సి.పి హయత్ మోహిద్దీన్, టి.పి.ఓ రమేష్ బాబు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
