జాతీయ రహదారిపై ప్రమాదం… వ్యక్తి సజీవ దహనం

Clock Of Nellore ( Sullurpeta ) – తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని జాతీయ రహదారిపై ఈ తెల్లవారు జామున ప్రమాదం జరిగింది. రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుండి వేగంగా వచ్చిన మరో లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం నుజ్జు నుజ్జు కాగా మంటల చెలరేగాయి. క్షణాల్లో లారీ క్యాబిన్ ను మంటలు చుట్టుముట్టాయి. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడగా, క్లీనర్ సుహేల్ క్యాబిన్ లో చిక్కుకుని బయటకు రాలేక మంటల్లోనే సజీవ దహనమయ్యాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే క్లీనర్ మృతి చెందాడు. సూళ్లూరుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Previous

ఆమంచర్లలో కొనసాగుతున్న కోటంరెడ్డి గడప గడప కార్యక్రమం…

Read Next

అమలాపురం అల్లర్లకు వైసీపినే కారణం : కేతంరెడ్డి ఆరోపణ

Leave a Reply

Your email address will not be published.