ఆమంచర్లలో కొనసాగుతున్న కోటంరెడ్డి గడప గడప కార్యక్రమం…

Clock Of Nellore ( Nellore Rural ) – నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగుతుంది. నిరాడంబరంగా సాగుతున్న ఈ కార్యక్రమం 45వ రోజుకు చేరింది. 45వ రోజైన బుధవారం ఆమంచర్ల పంచాయితీలోని అప్పయ్య కండ్రిగలో శ్రీధర్ రెడ్డి పర్యటించారు. ఇంటింటికి వెళ్లారు. ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలినవి త్వరలో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.

Read Previous

పారిశుద్ధ్యంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టండి – కమిషనర్ జాహ్నవి

Read Next

జాతీయ రహదారిపై ప్రమాదం… వ్యక్తి సజీవ దహనం

Leave a Reply

Your email address will not be published.