Clock Of Nellore ( Kodavaluru ) – నెల్లూరుజిల్లా కొడవలూరు మండలం, రేగడిచెలిక వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. రహదారి పక్కన ఆగి ఉన్న గ్రానైట్ లోడు లారీని వెనుక నుండి తుఫాన్ వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది వరకూ తీవ్రంగా గాయపడగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి సమీపంలోని ధూళిపాళ్ల గ్రామానికి చెందిన 12 మంది తుఫాన్ వ్యాన్ లో తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాధమికంగా పోలీసులు అంచనా వేశారు. గాయపడ్డ వారిని పోలీసులు నెల్లూరు జిజిహెచ్ కు తరలించారు.
