Clock Of Nellore ( Amaravathi ) – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లా పేరును మార్చింది. జిల్లా పేరును డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చుతున్నట్టు నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్ను జారీ చేసింది. నూతనంగా ఏర్పడిన కోనసీమకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని గతంలో వివిధ రాజకీయ పార్టీలతో పాటూ దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. అనేక జిల్లాలకు మాజీ ముఖ్యమంత్రుల పేర్లు పెట్టగా లేంది, కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టలేరా అని ప్రశ్నించారు. దీనిపై పునరాలోచన చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… కోనసీమకు నూతనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నూతన పేరుపై నోటిఫికేషన్ కూడా విడుదలైంది. దీనిపై దళిత సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు.