Clock Of Nellore ( Manubolu ) – నెల్లూరుజిల్లా మనుబోలు వద్ద జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న కారును ఢీ కొట్టింది లారీ. బద్దెవోలు సమీపంలో వేగంగా దూసుకొచ్చిన లారీ కారును ఢీకొట్టడంతో కారు రోడ్డు సైడు వాల్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతింది. కారులోని వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
