Clock Of Nellore ( Udayagiri ) – నెల్లూరు జిల్లా, ఉదయగిరి మండలం మూసాయిపేటలో బంగారం నిక్షేపాలు, రాగి నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించింది. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ మ్యాపింగ్ చేపట్టి ఐదు ప్రాంతాల్లో 46 నమూనాలు సేకరించింది. 2 వేల హెక్టార్లకు పైగా భూముల్లో నిక్షేపాలు ఉన్నట్లు ప్రాథమిక అంచనా వేసింది. ఇరవై నుంచి 110 మీటర్ల లోపు బంగారు నిక్షేపాలతో పాటు రాగి నిల్వలు ఉన్నట్లు గుర్తించింది. దీనిపై నిరంతరాయంగా నమూనాలను సేకరిస్తున్నారు … జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రతినిధులు.