Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ మండలంలోని మొగళ్లపాళెంకు చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక కీలుకుప్ప శ్రీనివాసులుతో సహా ఆయన మద్దతుదారులు వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో వైసీపిలో చేరారు. వారందరికీ కండువాలో వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరురూరల్ నియోజకవర్గంలోని ప్రజలంతా తనకు మద్దతు తెలపడం అదృష్ఠంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే అన్నారు. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రజా సంక్షేమంతో పాటూ కార్యకర్తల సంక్షేమానికి కూడా పెద్ద పీట వేస్తానని కోటంరెడ్డి స్పష్టం చేశారు.
