జాతీయ రహదారిపై ప్రమాదం – ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

Clock Of Nellore ( DV Satram ) – తిరుపతి జిల్లా దొరవారిసత్రం సమీపంలోని జాతీయ రహదారిపై ( NH 16 ) మంగళవారం ఉదయం ప్రమాదం జరిగింది. మావిళ్లపాడు సమీపంలో ముందు వెళ్తున్న బైక్ ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఒకరు అక్కడికక్కడే మృత్యువాత పడగా, బైక్ పై ఉన్న మరో ఇద్దరితో పాటూ రోడ్డుపై వెళ్తున్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దొరవారి సత్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Previous

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న.. బాలీవుడ్ నటి కంగనా రనౌత్

Read Next

ఆనంతో భేటీ అయిన జిల్లా వైద్యఆరోగ్య అధికారి పెంచలయ్య…

Leave a Reply

Your email address will not be published.