తుఫాను ఎఫెక్ట్ : నెల్లూరుజిల్లాలో కంట్రోల్ రూం ఏర్పాటు

Clock Of Nellore ( Nellore ) – అసని తుఫాను నేపద్యంలో నెల్లూరు జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయక చర్యల కోసం నెల్లూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ చక్రధర్ బాబు టోల్ ఫ్రీ నంబరును కేటాయించారు. 24 గంటలూ పనిచేసే విధంగా 1077 టోల్ ఫ్రీ నెంబర్ తో నిరంతరం పనిచేసే కంట్రోల్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ లోనే కాకుండా జిల్లాలోని అన్నీ ఆర్డీఓ, తహసీల్ధార్ కార్యాలయాల్లో కూడా కంట్రోల్ విభాగాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. తుఫాను సంబంధిత సహాయ చర్యల కోసం ఈ టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి ప్రభుత్వం సహాయక చర్యలు పొందాలన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.

Read Previous

వైద్యం చేసిన స్వీపర్లు, సెక్యూరిటీ… లెక్చరర్ మృతి… విచారణకు మంత్రి ఆదేశం

Read Next

ప్రభుత్వ వాదనలు తోసిపుచ్చిన న్యాయమూర్తి : మాజీ మంత్రి నారాయణకు బెయిలు

Leave a Reply

Your email address will not be published.