విద్యార్ధులు రాజకీయాల్లోకి రావాలి – VSU వార్షికోత్సవంలో మంత్రి కాకాణి పిలుపు

Clock Of Nellore ( Nellore ) – యువత అన్ని రంగాలతో పాటు రాజకీయ రంగంలో కూడా రాణించి, ప్రజలకు మెరుగైన పాలన అందించడంలో భాగస్వాములు కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం రాత్రి వెంకటాచలం మండలం, కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వ విద్యాలయ కళాశాల వార్షికోత్సవ వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జీవితంలో తాము అనుకున్న లక్ష్యం, గమ్యం చేరుకోవడానికి ఉన్న ఏకైక మార్గం విద్యార్థి జీవితమని, ప్రతి ఒక్క విద్యార్థి ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం మన కనీస బాధ్యత అని, వారికి మంచిపేరు తీసుకురావడంతోనే అది సాకారం అవుతుందన్నారు. డబ్బులు, హోదాలు ఎప్పుడు మనిషికి సంతోషం ఇవ్వలేవని, విద్యలో రాణిస్తే విద్యా మైదానంలో అందరూ విజేతలేనన్నారు. విద్యాలయంలో హాస్టల్, తరగతి గదులు, నీటి సౌకర్యం ఇతర మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ముందుగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని విశ్వవిద్యాలయ అధ్యాపకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విక్రమ సింహపురి విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ సుందరవల్లి, రిజిస్టార్ ఎల్ విజయ కృష్ణారెడ్డి, ప్రిన్సిపాల్ సుజ ఎస్ నాయర్, కో ఆర్డినేటర్ ఎం. హనుమారెడ్డి, అధ్యాపకులు మధుమతి, కిరణ్మయి, విజయ, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. 

Read Previous

ముస్లింలకు ఇఫ్తార్ విందు – పాల్గొన్న మంత్రి కాకాణి, ఎమ్మెల్యే కోటంరెడ్డి

Read Next

నెల్లూరు కార్పొరేషన్ స్కూల్ వార్షికోత్సవంలో పాల్గొన్న కలెక్టర్, మేయర్

Leave a Reply

Your email address will not be published.