Clock Of Nellore ( Nellore ) – నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ( India Vice – President ) నెల్లూరుకు విచ్చేశారు. తమిళనాడులోని త్రిశూలం నుంచి ప్రత్యేక రైలులో మంగళవారం ఉదయం 10.30 గంటలకు వెంకటాచలం రైల్వే స్టేషన్ కు విచ్చేసిన ( Venkaiah Naidu Nellore Tour ) భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుకి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఎస్పీ విజయరావు, ఏఎస్పి వెంకటరత్నం, ఆర్డివో కొండయ్య, డిఆర్ఎం శివేంద్రమోహన్, రైల్వే ఉన్నతాధికారులు సూర్య ప్రకాష్, సుదర్శన్, భాస్కర్ రెడ్డి, ఆంజనేయులు, వెంకటాచలం స్టేషన్ మాస్టర్ శివరాం, వివిధ రాజకీయ పార్టీల నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సన్నపురెడ్డి సురేష్ రెడ్డి, అబ్దుల్ అజీజ్, తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన నేరుగా స్వర్ణ భారత్ ట్రస్ట్ కు చేరుకున్నారు. రేపు ఉదయం అల్లూరులో దేవిరెడ్డి శారద ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత నెల్లూరులోని ఆలిండియా రేడియో కేంద్రంలో 100 మీటర్ల టవర్ ను ప్రారంభించి తిరిగి స్వర్ణ భారత్ ట్రస్ట్ కు చేరుకుంటారు. ఎల్లుండి పూర్తిగా స్వర్ణ భారత్ ట్రస్ట్ లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి ఈనెల 29న ఢిల్లీకి బయలుదేరి వెళతారు.
