Clock Of Nellore ( Tirupathi ) – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మైన్ కొండూరు అజయ్ రెడ్డి… ఎంపి విజయసాయి రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. తిరుపతిలో జరుగుతున్న వైఎస్ఆర్ మెగా జాబ్ మేళాకు విచ్చేసిన విజయసాయి రెడ్డిని… అజయ్ రెడ్డి కలిసి పుష్ప గుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి పంజమ్ సుకుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు.