కావలి పట్టణంలో మంత్రి కాకాణికి ఘన స్వాగతం… భారీ ర్యాలీ

Clock Of Nellore ( kavali ) – రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా నెల్లూరుకు విచ్చేస్తున్న కాకాణి గోవర్ధన్ రెడ్డికి ( Kakani Govardhan Reddy ) జిల్లాలో ఘన స్వాగతం లభిస్తోంది. ప్రకాశం జిల్లా నుండి నెల్లూరుజిల్లాకు ప్రవేశించే టోల్ ప్లాజా వద్ద కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుండి కార్లు, మోటార్ సైకిళ్లతో పట్టణం వరకూ ర్యాలీ చేపట్టారు. అనంతరం పట్టణంలో ఓపెన్ టాప్ వాహనంపై మంత్రి కాకాణి, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమర్ రెడ్డి కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వేలాది మంది కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కావలి నియోజకవర్గ అభివృద్ధిలో ఇకపై తాను కూడా భాగస్వామ్యులవుతానని ఈ సందర్భంగా మంత్రి కాకాణి హామీ ఇచ్చారు.

Read Previous

ఎంపి విజయసాయిరెడ్డిని కలిసిన కొండూరు అజయ్ రెడ్డి…

Read Next

సూళ్లూరుపేట అభివృద్ధికి కృషి : తిరుపతి ఎంపి గురుమూర్తి వెల్లడి

Leave a Reply

Your email address will not be published.