బీసీ హాస్టల్ లో పాము… నెల్లూరుజిల్లాలో విద్యార్ధికి కాటు

Clock Of Nellore ( Kondapuram ) – నెల్లూరు జిల్లా కొండాపురం బీసీ వసతిగృహంలో ( Nellore District ) పదో తరగతి విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు. ప్రస్తుతం కలిగిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గురువారం రాత్రి వసతి గృహంలో తోటి విద్యార్థులతో కలిసి జయరాజ్ నిద్రపోతుండగా.. అతడి ఛాతీపై రక్తపింజర కాటు వేసింది. వెంటనే హాస్టల్ వాచ్ మ్యాన్, తోటి విద్యార్థులు కలిసి పామును చంపేశారు. వెంటనే జయరాజ్‌ను కలిగిరి ఆసుపత్రికి తరలించారు. హాస్టల్ చుట్టూ పరిసరాలు సరిగాలేవని.. తరచూ విష సర్పాలు వస్తుంటాయని విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్ధి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

Read Previous

నాడు – నేడు పనులపై అధికారులతో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమీక్ష…

Read Next

రోడ్లు, భవనాల శాఖ మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసిన కోటంరెడ్డి

Leave a Reply

Your email address will not be published.