నాడు – నేడు పనులపై అధికారులతో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమీక్ష…

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నాడు – నేడు పథకం ద్వారా జరుగుతున్న పనుల పురోగతిపై వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శుక్రవారం వారి కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెండవ విడతలో భాగంగా అభివృద్ధి చేయనున్న 88 స్కూళ్లకు సంభందించి వివరాలు అడిగి తెలుసుకుని త్వరితగతిన పనులు ప్రారంభించి పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడ్డవద్దన్నారు. మొదటి విడతలో 46 స్కూళ్లలో 12.85 కోట్ల రూపాయలతో పనులు చేపట్టినట్లు గుర్తు చేశారు. మొదటి విడత పనులు పూర్తయ్యాయని త్వరలో రెండో విడత పనులు ప్రారంభించాలని గిరిధర్ రెడ్డి సూచించారు. నాడు – నేడు పథకానికి సంభందించి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయా శాఖల అధికారులతో పలుమార్లు మాట్లాడి 34 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటూ మాజీ కార్పొరేటర్ పిండి సురేష్ పాల్గొన్నారు.

Read Previous

భక్తి శ్రద్ధల మధ్య జరిగిన గుడ్ ఫ్రైడే… శిలువ మోసిన నగర ఎమ్మెల్యే అనీల్

Read Next

బీసీ హాస్టల్ లో పాము… నెల్లూరుజిల్లాలో విద్యార్ధికి కాటు

Leave a Reply

Your email address will not be published.