మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాప తీర్మానం… సభ్యుల భావోద్వేగం

Clock Of Nellore ( Amaravathi ) – గౌతమ్ రెడ్డి అకాల మరణం తనను ఎంతగానో బాధించిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ అన్నారు. మంగళవారం శాసనసభలో మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన తరువాత నెల్లూరుజిల్లాకు చెందిన సభ్యులు గౌతమ్ రెడ్డితో తమకు ఉన్న అనుబంధం గూర్చి మాట్లాడారు. గౌతమ్ రెడ్డి అకాల మరణం బాధాకరమని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. మేకపాటి కుటుంబంతో తనకు ఎంతో అనుబంధం ఉందని వారితో కలిసి పనిచేశానని గుర్తు చేసుకున్నారు. తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి లాగే గౌతమ్ రెడ్డి కూడా మృదు స్వభావి అని ఎవ్వరితోనూ విభేదాలు పెట్టుకునే వారు కాదన్నారు. అన్నీ రాజకీయ పార్టీలు ఆయన్ను అభిమానిస్తాయని ఆనం అసెంబ్లీలో అన్నారు.

సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్ని బాధ్యతలు నిర్వహించినా వివాదాలు లేకుండా సమర్ధవంతునిగా గౌతమ్ రెడ్డి పేరుతెచ్చుకున్నారన్నారు. ఆయన లేని లోటు తీరనిదన్నారు. మంత్రి అనీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ వివాదాలు లేని వ్యక్తి మేకపాటి గౌతమ్‌రెడ్డి. ఎలాంటి ఇగో లేని వ్యక్తి. గౌతమ్‌రెడ్డి సంతాప తీర్మానంపై మాట్లాడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఆయన మరణ వార్త వినగానే షాక్‌కు గురయ్యాం.. ఆ విషాదాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. 2010 నుంచి సన్నిహితగా మెలిగామంటూ వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకున్న మంత్రి అనిల్‌. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు ప్రసంగించాడు మంత్రి అనిల్‌.

Read Previous

సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరు: సీఎం వైఎస్‌ జగన్‌

Read Next

విదేశీ యువతిపై అత్యాచారం యత్నం కేసు… గంటల్లో అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు

Leave a Reply

Your email address will not be published.