విదేశీ యువతిపై అత్యాచారం యత్నం కేసు… గంటల్లో అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లాలో విదేశీ యువతిపై అత్యాచార యత్నం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్ చేశారు నెల్లూరు జిల్లా పోలీసులు. వివరాల్లో కెళ్తే… లూథియానా దేశానికి చెందిన కరోలినా అనే యువతి భారత దేశానికి విహార యాత్రకు వచ్చింది. శ్రీలంక కు వెళ్లిన ఆ యువతి గోవాకు వెళ్లేందుకు నిన్న అనగా 07- 03- 2022 రోజున చెన్నై విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడి నుండి బెంగుళూరుకు వెళ్లేందుకు బస్సు ఎక్కగా ఇండియన్ కరెన్సీ లేనందున యువతిని బస్సులో నుండి కండక్టర్ దింపివేశాడు.

ఇదే క్రమంలో అక్కడే ఉన్న క్యాబ్ డ్రైవర్ గా పనిచేసే నెల్లూరుజిల్లా మనుబోలు మండలం వెంకన్న పాళెంకు చెందిన 28 ఏళ్ల ఇంగిలాల సాయి కుమార్ అనే వ్యక్తి ఆమెతో పరిచయం పెంచుకుని ఇండియన్ కరెన్సీ ఆమెకు ఇచ్చి గోవాకు తాను తీసుకెళ్తానని నమ్మించాడు. అతన్ని నమ్మిన కరోలినా అతనితో కలిసి నెల్లూరుకు వచ్చింది. విదేశీ యువతిని అనుభవించాలన్న కోరికతో తన స్నేహితుడైన గూడూరు శారదా నగర్ కు చెందిన షేక్ ఆబిద్ అనే వ్యక్తికి సమాచారం అందించాడు. ఆమెను బైక్ పై వెంకన్న పాళెం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న ఆబిద్ తో కలిసి అటవీ ప్రాంతంలో అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఆమె కేకలు వేసి ఎలాగోలా వారి నుండి తప్పించుకుంది. స్థానికులు ఆమెను రక్షించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితులు ఇద్దరూ అక్కడి నుండి పరారయ్యారు.

హుటాహుటిన అక్కడకు చేరుకున్న సైదాపురం పోలీసులు విదేశీ యువతకు అండగా నిలిచి భరోసాగా నిలిచారు. నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. గంటల వ్యవధిలోనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

Read Previous

మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాప తీర్మానం… సభ్యుల భావోద్వేగం

Read Next

3 కోట్లతో రహదారి ఆధునీకరణ పనులు… శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Leave a Reply

Your email address will not be published.