వెంకటగిరిని రెవెన్యూ డివిజన్ గా మార్చండి… కలెక్టర్ కు ఆనం వినతి

Clock Of Nellore ( Nellore ) – నూతన జిల్లా శ్రీ బాలాజీ జిల్లాలో ప్రతిపాదించిన నెల్లూరుజిల్లాలోని వెంకటగిరి పట్టణ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గా మార్చాలని మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి అధికారులను కోరారు. దీనిపై ఆయన మంగళవారం నెల్లూరులో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబును కలిసి వెంకటగిరి మున్సిపాల్టీ, వెంకటగిరి రూరల్, డక్కిలి, బాలాయపల్లి మండల ప్రజలు, ప్రజా ప్రతినిధుల ఇచ్చిన విజ్ఞాపనను అందజేశారు. ప్రతిపాదిత శ్రీ బాలాజీ జిల్లాలో కలిసేందుకు నియోజకవర్గంలోని వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి మండల ప్రజలకు ఆమోదయోగ్యం అయినప్పటికీ… నూతన వెంకటగిరి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అత్యంత ఆవశ్యమని స్పష్టం చేశారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఆవశ్యకతను ప్రభుత్వానికి నివేదించాలని ఆనం కోరారు.

Read Previous

నూతన జిల్లాలకు కొత్త జెడ్పీ చైర్మన్లు… కసరత్తు చేస్తున్న ప్రభుత్వం

Read Next

రేపు నియోజకవర్గ బంద్… నెల్లూరులోనే గూడూరును కొనసాగించాలని డిమాండ్

Leave a Reply

Your email address will not be published.