కరీంనగర్‌లో కారు బీభత్సం.. నలుగురు మహిళలు మృతి

Clock Of Nellore ( KarimNagar ) – కరీంనగర్‌ పట్టణంలో కారు ఆదివారం ఉదయం బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు కమాన్‌ ప్రాంతంలోని రోడ్డు పక్కన ఉన్న గుడిసెల మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు మృతిచెందారు. మరో అయిదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే రోడ్డు ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కరీంనగర్‌లో ఆక్సిడెంట్ చేసిన కారుపై 9 ఓవర్ స్పీడ్ చలాన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటన చోటుచేసుకున్న తరువాత అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులు పరారయ్యారు. తర్వాత వారి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Read Previous

నమ్మించి ఫోన్‌తో పరార్‌.. కట్‌ చేస్తే.. ‘నీ ఫోన్‌ తీసుకెళ్లినందుకు క్షమించు’

Read Next

కన్న కూతురిపై తండ్రి అత్యాచారయత్నం…

Leave a Reply

Your email address will not be published.