రెండో భార్య కోసం నగరమంతా బ్యానర్లు.. ఎన్నికల్లో పోటీ చేసేందుకట !

Clock Of Nellore ( Aurangabad ) – మహారాష్ట్రలోని ఔరంగాబాద్​లో ఓ వ్యక్తి హాట్ ​టాపిక్​గా మారాడు. తనకు రెండో భార్య కావాలంటూ నగరం మొత్తం బ్యానర్లు ఏర్పాటు చేయటమే అందుకు కారణం. కాబోయే భార్యకు ఎలాంటి లక్షణాలు ఉండాలనే విషయాన్నీ వాటిలో పేర్కొన్నాడు. ఔరంగాబాద్​ మున్సిపల్​ ఎన్నికలు కొద్ది రోజుల్లో రానున్నాయి. రమేశ్​ పాటిల్​ అనే వ్యక్తి పోటీ చేయాలనుకున్నాడు. కానీ, అతనికి ముగ్గురు పిల్లలు ఉండటం వల్ల ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోయాడు. ఎలాగైనా బరిలో నిలవాల్సిందేనని పట్టుదలతో ఉన్న రమేశ్​.. ఓ ఉపాయం చేశాడు. తాను నిలబడలేకపోయినా.. తన కుటుంబంలో నుంచి ఒకరిని పోటీలో నిలపాలనుకున్నాడు. అయితే, సోదరుడు, సోదరి, తల్లిదండ్రులను కాదండోయ్​.. రెండో పెళ్లి చేసుకుని వచ్చే భార్యను ఎన్నికల్లో పోటీ చేయించాలని సంకల్పించుకున్నాడు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు రెండో భార్య కావాలంటూ ఏకంగా నగరం మొత్తం బ్యానర్లు కట్టించాడు. తనకు కాబోయే భార్య ఎలా ఉండాలో ఆ హోర్డింగుల్లో పేర్కొన్నాడు. ఏ మతం అయినా, పెళ్లి కాని లేక భర్తతో విడిపోయిన, భర్త మరణించిన 25 నుంచి 40 ఏళ్ల మహిళ అర్హురాలిగా తెలిపాడు. అయితే, పెళ్లి అయి ఉంటే ఆ మహిళకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలనే షరతు పెట్టాడు. తన ఫోన్​ నంబర్​ సైతం బ్యానర్లలో అచ్చు వేయించాడు. ఇప్పుడు ఆయన ప్రకటనపైనే నగర జనం మొత్తం చర్చించుకుంటున్నారు.

Read Previous

దారుణం.. బాలికపై తండ్రీకొడుకుల అత్యాచారం

Read Next

ఒకేసారి ఆరు వాహనాలు ఢీ – తొమ్మిది మంది మృతి

Leave a Reply

Your email address will not be published.