Clock Of Nellore ( America ) – అమెరికాలో నెవాడా రాష్ట్రం లాస్ వెగాస్‌లో ఘోరో ప్రమాదం జరిగింది. ఆరు వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతులంతా యుక్తవయసు వారేనని వెల్లడించారు. అమెరికా కాలమానం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో 15 మంది చిక్కుకున్నారు. అతివేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి మరో వాహనాన్ని ఢీకొట్టడమే ఈ ఘటనకు కారణమని నార్త్ లాస్ వెగాస్ పోలీసు అధికారి అలెగ్జాండర్ క్యూవాస్ తెలిపారు.