దారుణం.. బాలికపై తండ్రీకొడుకుల అత్యాచారం

Clock Of Nellore ( Maha Rastra ) – మహారాష్ట్ర ఠాణె​ జిల్లాలో అత్యంత పాశవిక ఘటన వెలుగుచూసింది. 16 ఏళ్ల బాలికపై తండ్రీకొడుకులు అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన కొల్సేవాడి పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. బాధితురాలి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. స్క్రాప్​ డీలర్​(53), అతని కుమారుడు(23) కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితులను అరెస్ట్​ చేసినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read Previous

సోమవారం నుంచి బడ్జెట్​ సమావేశాలు.. విపక్షాల ‘ఆపరేషన్​ పెగసస్​’ !

Read Next

రెండో భార్య కోసం నగరమంతా బ్యానర్లు.. ఎన్నికల్లో పోటీ చేసేందుకట !

Leave a Reply

Your email address will not be published.