నెల్లూరు నగరంలో దారుణం : దంపతులను గొంతు కోసి చంపిన కిరాతకులు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దండగులు అతి కిరాతంగా దంపతులను గొంతు కోసి హత్య చేశారు. నగర ప్రజలను ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణాజిల్లాకు చెందిన వాసిరెడ్డి కృష్ణారావు – సునీత దంపతులు 25 ఏళ్ల క్రితం నెల్లూరుకు వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు. కృష్ణారావు కరెంటాఫీస్ సెంటర్ లో శ్రీరామ క్యాంటీన్ నడుపుతుండగా, సునీత గృహిణి. ఈ క్రమంలో గత అర్ధరాత్రి ఇంట్లో కృష్ణారావు లేని సమయంలో పడారుపల్లి అశోక్ నగర్ లోని వారి నివాసంలోకి చొరబడ్డ దుండగులు బెడ్ పై ఉన్న సునీతను అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు. కృష్ణారావు కోసం అక్కడే వేసి చూశారు. కృష్ణారావు బయట స్కూటర్ పెట్టి ఇంట్లోకి ప్రవేశించేందుకు గేటు తీయగా అక్కడే నక్కి ఉన్న దుండగులు గేటు వద్దే ఆయన్ను కూడా గొంతు కోసి అక్కడి నుండి పరారయ్యారు. కృష్ణారావు గేటు వద్దే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. ఆదివారం ఉదయం పాలు పోసేందుకు మహిళ రాగా గేటు వద్ద కృష్ణారావు మృతదేహం పడి ఉంది. దీంతో ఆమె వారి బంధువులకు సమాచారం అందించారు. బంధువులు వచ్చి చూడగా సునీతను కూడా హత్య చేసి విషయాన్ని గుర్తించారు. విషయం తెలుసుకున్న వేదాయపాళెం పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు జిజిహెచ్ కు తరలించారు. జిల్లా ఎస్పీ విజయరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నేరస్తులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. మరో వైపు తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్ కూడా జిజిహెచ్ లో ఉన్న కృష్ణారావు – సునీత మృతదేహాలను చూశారు. ఈ హత్య వెనుక దాగి ఉన్న నిజాలను పోలీసులు వెలికితీయాలని కోరారు. నెల్లూరులో శాంతి భద్రతలు రోజు రోజుకీ దిగజారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ వీరాభిమాని అయిన కృష్ణారావు – సునీత దంపతులను కోల్పోవడం విచారకరమని పేర్కొన్నారు.

 

Read Previous

నెల్లూరులో నూతన ప్రెస్ క్లబ్ కు స్థలం ఇవ్వండి : కలెక్టర్ ను కోరిన కోటంరెడ్డి

Read Next

నకిలీ ఈడి అధికారులను అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు…

Leave a Reply

Your email address will not be published.