Clock Of Nellore ( Nellore ) – జిల్లా కేంద్రమైన నెల్లూరులో నూతన ప్రెస్ క్లబ్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని కలెక్టర్ ను కోరారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇవాళ నెల్లూరులో ఇంఛార్జ్ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వరంలో జరిగిన జిల్లా అభివృద్ది కమిటి సమావేశంలో కోటంరెడ్డి దీన్ని ప్రతిపాదించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే జర్నలిస్టుల సౌకర్యాల కోసం అందరూ ఆలోచించాలని పేర్కొన్నారు. ప్రస్తుతమున్న ప్రెస్ క్లబ్ భవనం చాలా చిన్నదని అది కూడా శిధిలావస్థకు చేరిందని కలెక్టర్ చక్రధర్ బాబు దృష్ఠికి తీసుకెళ్లారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం పక్కన ఖాళీగా ఉన్న టిబి హాస్పిటల్ స్థలంలో కొంత స్థలాన్ని ప్రెస్ క్లబ్ కు కేటాయించాలని కోరారు. ఆ స్థలంలో నెల్లూరుజిల్లాలోని ముగ్గురు ఎంపిలు, మిగతా ఎమ్మెల్యేల సహకారంతో అధునాతన సౌకర్యాలతో ప్రెస్ క్లబ్ ను నిర్మిస్తామని కోటంరెడ్డి కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.