గుండెపోటు ఆపరేషన్ లో సరికొత్త విధానం… అపోలో హాస్పిటల్ లో నూతన పరికరం

  • హార్ట్ వాల్వ్ రిప్లేస్‌మెంట్‌లో స‌రికొత్త విధానం
  • స్ట్రోక్ ప్ర‌మాదాన్ని త‌గ్గించేందుకు స‌రికొత్త ప‌రిక‌రం
  • ద‌క్షిణ భార‌త‌దేశంలోనే తోలిసారిగా అపోలో హాస్పిట‌ల్‌లో అందుబాటు…
  • సెంటిన‌ల్ సెరిబ్ర‌ల్ ప్రొటెక్ష‌న్ సిస్ట‌మ్‌తో హార్ట్ స్ట్రోక్‌కి చెక్‌
  • 89ఏళ్ల రోగికి ఈ ప్ర‌క్రియ ద్వారా విజ‌య‌వంతంగా చికిత్స‌
  • వివ‌రాలు వెల్ల‌డించిన ఇంట‌ర్వెన్ష‌న‌ల్ కార్డియాల‌జిస్ట్ డాక్ట‌ర్ సెంగొట్టువేలు

Clock Of Nellore ( Chennai ) – మారుతున్న కాలానికి అనుగుణంగా వైద్య‌రంగంలో స‌రికొత్త టెక్నాల‌జీని అందిపుచ్చుకుని, రోగుల‌కు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న అపోలో హాస్పిట‌ల్ మ‌రో స‌రికొత్త ప‌రిక‌రాన్ని ఉప‌యోగిస్తూ హృద్రోగుల‌కు భ‌రోసా క‌ల్పిస్తోంది ( Chennai Apollo Hospital ). అందులో భాగంగా హార్ట్ వాల్వ్ రీప్లేస్‌మెంట్ ప్ర‌క్రియ‌లో భాగంగా స్ట్రోక్ ప్ర‌మాదాన్ని త‌గ్గించేందుకు సెంటినెల్ సెరిబ్ర‌ల్ ప్రొటెక్ష‌న్ సిస్ట‌మ్‌ను వినియోగిస్తున్నారు. ఈ ప‌రిక‌రాన్ని ఉప‌యోగించ‌డంలో అపోలో హాస్పిట‌ల్స్ ద‌క్షిణ భార‌త దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇందులో భాగంగా నెల్లూరుకు చెందిన 89ఏళ్ల రోగికి సెంటిన‌ల్ సెరిబ్ర‌ల్ ప్రొటెక్ష‌న్ సిస్ట‌మ్‌ను ఉప‌యోగించి, విజ‌య‌వంతంగా చికిత్స‌ను పూర్తి చేశారు. సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ మ‌రియు ఇంట‌ర్వెన్ష‌న‌ల్ కార్డియాల‌జిస్ట్ డాక్ట‌ర్ సెంగొట్టువేలు, వారి బృందం ఈ ప్ర‌క్రియ‌ను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ సెంగొట్టు వేలు మాట్లాడుతూ 89ఏళ్ల వృద్దుడికి 2006 సంవ‌త్స‌రంలో గుండె ఆప‌రేష‌న్ చేశార‌ని, అయితే అత‌నికి శ్వాస‌ తీసుకోవ‌డంలో తీవ్ర ఇబ్బందితో పాటూ వాపు ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని అన్నారు. దీనిని ప‌రీక్షించ‌గా, గ‌తంలో చేసిన ఆప‌రేష‌న్‌లో ధ‌మ‌ని క‌వాటాలు క్షీణించిన‌ట్లు గుర్తించామ‌ని అన్నారు. అంతేకాకుండా కాలేయ వ్యాధితో పాటూ సిఓపిడి, మూత్ర‌పిండాల స‌మ‌స్య‌, ఊపిరితిత్తుల వ్యాధితో బాధ‌ప‌డుతున్న అత‌ను ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌రిస్థితిలోఉన్నార‌ని అన్నారు.

ఈ ప‌రిస్థితిలో అత‌నికి గుండె సంబంధిత ఆప‌రేష‌న్ చేయ‌డం క్లిష్ట‌త‌ర‌మైన‌ద‌ని తెలిపారు. అయితే గుండెకు సంబంధించిన క‌వాటాలు క్షీణించి, స్ట్రోక్ వ‌చ్చే ప్ర‌మాదం అధికంగా ఉంద‌ని గుర్తించి, సెంటినెల్ సెరిబ్ర‌ల్ ప్రొటెక్ష‌న్ ప‌రిక‌రంతో ధ‌మ‌ని క‌వాటాల‌ను ఇంప్లాటేష‌న్‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసి, 89ఏళ్ల వృద్ధుడిని స్ట్రోక్ ప్ర‌మాదం నుంచి కాపాడిన‌ట్లు తెలిపారు. టిఏవిఐ ప్ర‌క్రియ‌లో స్ట్రోక్ రిస్క్ ఉంటుంద‌ని, అయితే సెంటినెల్ ప‌రిక‌రం ద్వారా చేసే చికిత్స‌లో టిఏవిఐలో స్ట్రోక్ రిస్క్ ఉండ‌ద‌ని అన్నారు. ఈ ప‌రిక‌రాన్ని ఉప‌యోగించి, ద‌క్షిణ భార‌త‌దేశంలో తొలిసారిగా విజ‌య‌వంతంగా అపోలో హాస్పిట‌ల్‌లో చికిత్స‌ను పూర్తి చేశామ‌ని, డాక్ట‌ర్ సెంగొట్టు వేలు వెల్ల‌డించారు. రోగుల‌కు స‌రికొత్త సాంకేతిక‌త‌ను అందించ‌డ‌డంలో అపోలో హాస్పిటల్ ఎల్ల‌ప్పుడు ముందు ఉంటుంద‌ని, వెల్లడించారు. ప్ర‌మాద‌క‌ర‌మైన గుండె సంబంధిత వ్యాధుల‌తో బాధ‌ప‌డేవారికి ఈ సెంటినెల్ సెరిబ్ర‌ల్ ప్రొటెక్ష‌న్ ప‌రిక‌రంతో చేసే చికిత్స వారికి నూత‌న జీవితాన్ని ప్ర‌సాదిస్తుంద‌ని, దీనిని హృద్రోగులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు.

Read Previous

డాక్ట‌ర్ బిందు మీన‌న్‌కు రెండు ప్ర‌తిష్ఠాత్మ‌క అవార్డులు…

Read Next

ఇంటి వద్దకే మెడికవర్ ఆరోగ్య సేవలు… బ్రోచర్ ఆవిష్కరించిన మంత్రి కాకాణి

Leave a Reply

Your email address will not be published.