Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ బిందుమీనన్ రెండు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. ( Nellore Apollo Hospital ) అమెరికన్ అకాడమి ఆఫ్ న్యూరాలజీతో పాటూ అమెరికన్ బ్రెయిన్ ఫౌండేషన్ నుంచి డాక్టర్ బిందు మీనన్ ఈ రెండు అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు అపోలో హాస్పిటల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ తో కలిసి డాక్టర్ బిందు మీనన్ మాట్లాడారు. ఏబి బేకర్ టీచర్స్ రికగ్జైనేజేషన్ అవార్డుతోపాటూ, మృదా స్పిరిట్ ఆఫ్ న్యూరాలజీ అవార్డులు తనకు దక్కడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. 2022 సంవత్సరానికి సంబంధించి, న్యూరాలజీపై అవగాహన కల్పించడంతోపాటూ, రోగుల పట్ల మానవతాదృక్పదంతో ముందుకు సాగినందుకు, న్యూరాలజీ సేవలను విసృతం చేసినందుకు మృదా స్పిరిట్ ఆఫ్ న్యూరాలజీ అవార్డును ప్రధానం చేశారని అన్నారు. అంతే కాకుండా న్యూరాలజీకి సంబంధించిన టీచింగ్ విషయంలో ముఖ్య భూమిక పోషించడంతో పాటూ రానున్న రోజుల్లో న్యూరాలజీ ప్రాముఖ్యతను తెలియజేసినందుకు ఏబి బేకర్ టీచర్స్ రికగ్జైనేజేషన్ అవార్డును ప్రధానం చేశారని పేర్కొన్నారు. పేద, సామాజిక వర్గాలకు న్యూరాలజీ సేవలను ఉచితంగా అందిచండం కూడా ఈ అవార్డులు తనకు వచ్చేందుకు ఎంతో దోహదపడిందని ఆమె వివరించారు. ఈ రెండు అవార్డులు తనపై బాద్యతను మరింతగా పెంచాయని, రానున్న రోజుల్లో న్యూరాలజీ సేవలను అట్టడుగు వర్గాలకు సైతం చేరేలా తనవంతు కృషి చేస్తానని డాక్టర్ బిందు మీనన్ స్పష్టం చేశారు.