Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్ లో ప్రపంచ అత్యవసర వైద్య సేవల దినోత్సవం జరిగింది. హాస్పిటల్ సెంటర్ హెడ్ డాక్టర్ గణేష్ పర్యవేక్షణలో అత్యవసర వైద్య సేవల విభాగ అధిపతి డాక్టర్ కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా కేక్ కట్ చేసి అత్యవసర వైద్య సేవలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ ప్రతీ హాస్పిటల్ కు ఎమర్జెన్సీ విభాగం అనేది గుండె లాంటిదని అన్నారు. హార్ట్ ఎటాక్, బ్రెయిన్ ఎటాక్, యాక్సిడెంట్స్, పాయిజన్స్ కేసులు, పాము కాటు తదితర విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు హాస్పిటల్ లోని ఎమర్జెన్సీ విభాగం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. అలాంటి సమయాల్లో ప్రాణాపాయాన్ని తప్పించే అవకాశం ఒక్క ఎమర్జెన్సీకే ఉందని స్పష్టం చేశారు. మనిషి ఆరోగ్య విషయంలో అప్పటికప్పుడు సంభవించే విపత్కరాలను సరిచేసే విభాగం ఎమర్జెన్సీదేనన్నారు. నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ లో 24 గంటలూ ఎమర్జెన్సీ విభాగం సేవలు అందుబాటులో ఉంటాయని, అంతే కాకుండా ఎమర్జెన్సీకి అవసరమైన వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ఎమర్జెన్సీ కేసులకు అవసరమైన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మెడికల్ సూపరిటెండెంట్ డాక్టర్ ఆనంద్, ఆపరేషన్ హెడ్ వర ప్రసాద్, పిఆర్వో చందు వర్మ, వైద్యులు డాక్టర్ కిరణ్ కుమార్, బిందు శ్వేత, ఆలూరు సాహిత్య, సిబ్బంది పాల్గొన్నారు.