కత్తిపోట్లకు గురైన యువకుడు మృత్యువాత…

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరంలో నిన్న సాయంత్రం కత్తిపోట్లకు గురైన విజయ కుమార్ ఇవాళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు. నగరంలోని మనుమసిద్ధినగర్ కు చెందిన విజయకుమార్ ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తుండేవాడు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం టౌన్ హాల్ ఎదురు వీధిలోని ఓ టీ దుకాణం వద్ద ఉండగా ఇద్దరు యువకులు వచ్చి విజయకుమార్ ను కిరాతకంగా పొడిచి పరారయ్యారు. కత్తిపోట్లతో కుప్పకూలిన విజయకుమార్ ను చిన్నబజార్ పోలీసులు నగరంలోని జిజిహెచ్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ మధ్యాహ్నం కన్నుమూశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు కోటమిట్టకు చెందిన మసూద్ మరో ఇద్దరుగా గుర్తించారు. నిందితుడు మసూద్ తో విజయకుమార్ కు విభేదాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 

Read Previous

పవన్ కళ్యాణ్ తోనే సుపరిపాలన – ప్రజాబాటలో కేతంరెడ్డి పిలుపు

Read Next

నెల్లూరు మెడికవర్ లో ప్రపంచ అత్యవసర వైద్య సేవల దినోత్సవం

Leave a Reply

Your email address will not be published.