ఈనెల 28న నెల్లూరుకు సిఎం జగన్… గౌతంరెడ్డి సంతాప సభకు హాజరు

Clock Of Nellore ( Nellore ) – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 28వ తేదీనా నెల్లూరుకు రానున్నారు. అదే రోజు నెల్లూరు శివారు కనుపర్తిపాడులోని విపిఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగే దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాప సభకు హాజరుకానున్నారు. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం మేరకు 28వ తేదీ ఉదయం 11 గంటలకు అమరావతి నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ లో నెల్లూరులోని కనుపర్తిపాడుకు చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో విపిఆర్ కన్వెన్షన్ హాల్ కు చేరుకుంటారు. మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాప సభలో ప్రసంగించిన అనంతరం మధ్యాహ్నం తర్వాత హెలికాప్టర్ తిరిగి అమరావతికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటన నేపద్యంలో బుధవారం పోలీసు అధికారులు హెలిపాడ్ ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై పరిశీలన చేశారు. రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రి పర్యటన వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.

Read Previous

బస్సు ప్రమాదంపై మేకపాటి దిగ్భ్రాంతి… మృతురాలికి సాయం ప్రకటన

Read Next

డిజిపిని కలిసిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి…

Leave a Reply

Your email address will not be published.