Clock Of Nellore ( Vijayawada ) – పూర్వపు నెల్లూరుజిల్లా ఎస్పీ, ఇటీవల రాష్ట్ర డిజిపిగా బాధ్యతలు తీసుకున్న కెవి రాజేంద్రనాథ్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి. వైసీపి రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డితో కలిసి విజయవాడలోని వారి కార్యాలయంలో డిజిపిని కలిసి పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.